బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ఎవ్వరు లేని అనాధ మృతదేహానికి ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. గత 4 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఆనారోగ్యంతో మృతిచెందగా అతనికి సంబంధించిన సంబందికులు ఎవరు రాకపోవడంతో పోలిసులు అతనిని అనాధగా గుర్తించి 3వ ఠాణా ఎస్.ఐ మహేష్ ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ద్వారా అంత్యక్రియలు నిర్వహించమని కోరగా శనివారం దేవి థియేటర్ ప్రక్కన గల సార్వజనిక్ స్మశాన వాటికలో అనాధ శవానికి సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అర్జున్, ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు మద్దుకూరి సాయిబాబు, కార్యదర్శి జయదేవ్ వ్యాస్ , సాయితేజ, పురుషోత్తం రెడ్డి, 3వ ఠాణా పోలిస్ సిబ్బంది తాయూబ్ తదితరులు పాల్గొన్నారు.

