24 C
Hyderabad
Sunday, August 2, 2026

240 సైలెన్సర్ల ధ్వంసం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లను ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైకర్లపై పోలీసులు కన్నెర్ర చేశారు. వాహనాల సైలెన్సర్లను తీసివేయించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 240 సైలెన్సర్లను నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాహనదారులతోపాటు షోరూమ్ ల నిర్వాహకులు, మెకానిక్ లపై చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరించారు.

240 silencers destroyed

More articles

Latest article