27.5 C
Hyderabad
Friday, July 31, 2026

బాధితులకు 170 మొబైల్ ఫోన్ ల అందజేత

Must read

📰 Generate e-Paper Clip

. . . నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

ప్రజలు పోగొట్టుకున్న, చోరికి గురైన 170 మొబైల్ ఫోన్లను పట్టుకుని తిరిగి వారికి అప్పగించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ డివిజన్ లో గత కొన్ని రోజుల నుండి పోయిన, చోరీకి గురైన సుమారు 17 లక్షల రూ. విలువ గల 170 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి సంబంధిత మొబైల్ ఫోన్ల యజమనులకి అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేమని, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్ , పాస్ వర్డ్స్ వంటివి మొబైలో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే ,గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల (https://www.ceir.gov.in) నందు బ్లాక్ చేసి , సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లయితే ఆ షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక ప్రజలు కొనుగోలు చేసి మోసాలకు గురవుతున్నారన్నారు. ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

More articles

Latest article