బాధితులకు 170 మొబైల్ ఫోన్ ల అందజేత

. . . నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజలు పోగొట్టుకున్న, చోరికి గురైన 170 మొబైల్ ఫోన్లను పట్టుకుని తిరిగి వారికి అప్పగించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ డివిజన్ లో గత కొన్ని రోజుల నుండి పోయిన, చోరీకి గురైన సుమారు 17 లక్షల రూ. విలువ గల 170 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి...