అమరజీవి బాల మల్లేష్, పోటుప్రసాద్ సంస్మరణ సభ

0 1,203

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ హమాలి యూనియన్ హాల్లో సోమవారం అమరజీవి బాల మల్లేష్, పోటు ప్రసాద్ ల సంస్మరణ సభలో వారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్,  సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ బాలమల్లేష్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ఆయన చిన్ననాటి నుండి మక్ధూమ్ భవన్లో రెడ్ గార్డ్ గా, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకుడిగా సేవలందించారని, కార్మికుల కోసం అనేక సంఘాలు ఏర్పాటు చేశారని అన్నారు.  అమరజీవి కామ్రేడ్ పోటు.ప్రసాద్ కుటుంబం పార్టీ కుటుంబమని ఖమ్మం జిల్లాలో పార్టీ,ప్రజాసంఘాల నిర్మాణంలో  పోటు ప్రసాద్ అన్న తనదైన ముద్ర వేసుకున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు.  ఉదయం పూట వాకింగ్ చేస్తున్న సమయంలోనే హఠాత్ మరణం పొందాలని వీరి సేవలు భారత కమ్యూనిస్టు పార్టీ,ప్రజాసంఘాలు మర్చిపోవని వారు కోరుకున్న సమ సమాజం కోసం పార్టీ నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. అప్పుడే వారికి ఘనమైన నివాళులు అని అన్నారు.  ఈ సంస్కరణ సభలో నాయకులు పి.హనుమన్లు, పరశురాం, నరేష్, అమర్, శ్రీహరి, అంబాదాస్, బొజరాజు, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.