26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఏర్గట్ల, బతుకమ్మ  : ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని, తెలంగాణ భాష దినోత్సవాన్ని ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, భాషాపరంగా, సాహిత్యపరంగా, సంస్కృతి పరంగా, తెలంగాణ ముందంజలో ఉన్నదని, ముఖ్యంగా తెలంగాణ భాషను ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలని, తెలంగాణ భాషకు చాలా గొప్ప చరిత్ర ఉందని, కాళోజి నారాయణరావు తెలంగాణ భాషకు గొప్పనైన గౌరవాన్ని ఇచ్చాడని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పిల్లలకు అనేక విషయాలు తెలుస్తాయని విద్యార్థులు కూడా ఇట్టి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని తెలిపారు, తెలంగాణ భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని సాహిత్య పోటీలు నిర్వహించడం జరిగింది, ఇందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, పవన్,సమిత,రాజశేఖర్, ఎస్.శ్రీనివాస్, విజయకుమార్,రాజేందర్, రాజనర్సయ్య ,గంగాధర్, ప్రవీణ్ శర్మ, జ్యోతి, కే. శ్రీనివాస్, సబిత పాల్గొన్నారు.

More articles

Latest article