కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

ఏర్గట్ల, బతుకమ్మ  : ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని, తెలంగాణ భాష దినోత్సవాన్ని ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, భాషాపరంగా, సాహిత్యపరంగా, సంస్కృతి పరంగా, తెలంగాణ ముందంజలో ఉన్నదని, ముఖ్యంగా తెలంగాణ భాషను ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలని, తెలంగాణ భాషకు చాలా గొప్ప చరిత్ర ఉందని, కాళోజి నారాయణరావు తెలంగాణ భాషకు గొప్పనైన గౌరవాన్ని ఇచ్చాడని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పిల్లలకు అనేక విషయాలు...