. . . ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ హనుమాన్ స్వాములకు భిక్ష (అన్నప్రసాద వితరణ) కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని స్వాములతో కలిసి సామూహిక బిక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ కు అభినందనలు తెలుపుతూ నిన్న ముస్లిం సోదరుల కొరకు ఇఫ్తార్ విందు గాని, ఈ రోజు హనుమాన్ స్వాములకు భిక్ష కార్యక్రమం గాని ఎంతో సంతోషకరంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ మతాలకు అతీతంగా, అన్ని మతాల వారికి సమానంగా కలుపుకోయే పార్టీ అని దీని వల్లనే అందరికీ అర్థమవుతుందని అన్నారు. కేవలం ఒక మతం పేరుతో ప్రజలను మభ్యపెట్టేవాళ్ళం కాదని, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని గాంధీ సిద్ధాంతాలను నమ్మేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. నిన్న, ఈ రోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేసిన ఇఫ్తార్ విందు, భిక్ష కార్యక్రమాలు ఎంతో ఆదర్శమని తెలిపారు. మతభేదాలు లేకుండా అన్ని మతాల వారిని కలుపుకొని పోయే దిశగా బొబ్బిలి రామకృష్ణ అడుగులువేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, మేయర్ ఉమారాణి రమేష్, కార్పొరేటర్ మనోహర్, బంటు బలరాం, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

