28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి

Must read

📰 Generate e-Paper Clip

  • గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ శరత్

 

బతుకమ్మ భిక్కనూరు: ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ శరత్ అన్నారు. భిక్కనూరు మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ  డాక్టర్ శరత్ మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని సూచించారు. రానివారు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అర్హత అయిన ప్రతి ఒక్కరికి వస్తాయని, రాను వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,  గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని రజిత, తాసిల్దార్ శివప్రసాద్,ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి భీమ్ రెడ్డి,  ఆర్ఐ బాలయ్య పంచాయతీ సెక్రెటరీ సౌజన్య మహేష్ గౌడ్ ప్రశాంత్ ఉన్నారు.

All the deserving will get welfare benefits

More articles

Latest article