ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

0 8,561

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పటాసులు కాల్చారు. అనంతరం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షుడు నర్సింలు, మాజీ కౌన్సిలర్ సాయిలు, ఇమాన్ సర్పంచ్ సాయిలు, నాయకులు శ్రవణ్ కుమార్, గంగారెడ్డి, రవి, పృథ్వీరాజ్, నాగం రాజయ్య, అంజా గౌడ్, శివానంద్, అరవింద్ గౌడ్, బర్కత్, అలిపాష, గోపాల్, యువ నాయకులు బబ్లూ, పడమటి దయాకర్, భారత్, సాయి, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.