నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : యూనివర్సిటీలో నూతనంగా ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాల మంజూరు అయ్యాయని విద్యార్థులకు అందరికీ హాస్టల్ అడ్మిషన్ ఇవ్వాలని, రెండో పీజీ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్స్ ఇవ్వొద్దని పి డి ఎస్ యూ యూనివర్సిటీ నాయకులు అక్షయ్,గౌతం రాజ్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కు తే. యూ పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ లో నూతన కోర్సులు వచ్చాయని, కోర్సులకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. గర్ల్స్ కు నూతన హాస్టల్స్ నిర్మించాలని, యూనివర్సిటీ లో నూతన కోర్సులకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యార్థుల దగ్గర హాస్టల్ డిపాజిట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. గతంలో అనేకమంది రెండో పి జి చేసే విద్యార్థులకు హాస్టల్ అవకాశమిచ్చారని వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు రాకేష్, హుస్సేన్, బీమేశ్ , రాజు తదితరులు పాల్గొన్నారు.
