బతుకమ్మ భిక్కనూర్: అఖిల భారత గో సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలకృష్ణ గురుస్వామి గోరక్షణ కోసమై చేపట్టిన కాశ్మీర్ టు కన్యాకుమారి గో పాదయాత్ర సోమవారం భిక్కనూరు చేరుకుంది. ఈ సందర్భంగా గో మహా పాదయాత్రకు భిక్కనూరు అయ్యప్ప స్వాములు స్వాగతం పలికారు. అనంతరం అఖిల భారత గో సేవ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆవులను రక్షించాలన్న ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు అయ్యప్ప స్వాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

