27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్

Must read

📰 Generate e-Paper Clip

బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని ఆరోపణలు

కులవివక్షకు వ్యతిరేకంగా పూలే పోరాటం చేశారు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని ఇది రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యనించారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇందిరా పార్క్ వద్ద మంగళవారం ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసినందున ఆ పార్టీపై, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో మేము కూడా కలిసి వస్తామన్నారు. కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షల్లో కూర్చుందామన్నారు. బీసీ కులగణన బిల్లు చట్టసభ ఆమోదం పొంది నాలుగు వారాలైందన్నారు.  ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయా… లేదా రాష్ట్రపతికి పంపించారా అని ప్రశ్నించారు ? బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని ఆరోపించారు. కులవివక్షకు వ్యతిరేకంగా పూలే అవిశ్రాంతంగా పోరాటం చేశారన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్ఫూర్తి పొందుతుందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామన్నారు.  ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. రిజర్వేషన్ల పెంపునకు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసి సాధించామన్నారు.  ఇది తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీఆర్ఎస్ పార్టీ విజయమన్నారు.

More articles

Latest article