27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

క్షేత్రస్థాయిలో ఇండ్ల గణనను పరిశీలించిన అడిషనల్ చార్జ్ ఆఫీసర్

Must read

📰 Generate e-Paper Clip

 

బాల్కొండ, బతుకమ్మ :

 

ఇండ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియలో భాగంగా, ఆదివారం అడిషనల్ చార్జ్ ఆఫీసర్, మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ కిషన్ నగర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేపట్టారు. వారు ప్రతి ఇల్లు, కుటుంబాల వివరాల నమోదు, మొబైల్ యాప్‌ల పనితీరు, గణకులు ఎన్యూమరేటర్లు నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారా లేదా అని పరిశీలించారు. చార్జ్ ఆఫీసర్లు తమ పరిధిలోని ఇండ్లను బ్లాక్‌లుగా సరిగ్గా విభజించారో లేదో పరిశీలించారు. జనగణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుండటంతో, ఎన్యూమరేటర్లు తమ మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరించడాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఇండ్ల గణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, ప్రతి ఇంటినీ కచ్చితంగా లెక్కించేలా చూడాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గణన ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే, సదరు సూపర్ వైజర్ లు ఎన్యుమరేటర్లు తనను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కిషన్ నగర్ గ్రామ సర్పంచ్ రామరాజు గౌడ్, సూపర్ వైజర్ మాలెం సాయన్న, ఎన్యుమరేటర్ లు రాజారపు కీర్తి, రమాదేవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Additional Charge Officer inspects house census at field level

More articles

Latest article