క్షేత్రస్థాయిలో ఇండ్ల గణనను పరిశీలించిన అడిషనల్ చార్జ్ ఆఫీసర్

  బాల్కొండ, బతుకమ్మ :   ఇండ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియలో భాగంగా, ఆదివారం అడిషనల్ చార్జ్ ఆఫీసర్, మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ కిషన్ నగర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేపట్టారు. వారు ప్రతి ఇల్లు, కుటుంబాల వివరాల నమోదు, మొబైల్ యాప్‌ల పనితీరు, గణకులు ఎన్యూమరేటర్లు నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారా లేదా అని పరిశీలించారు. చార్జ్ ఆఫీసర్లు తమ పరిధిలోని ఇండ్లను బ్లాక్‌లుగా సరిగ్గా విభజించారో లేదో పరిశీలించారు. జనగణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుండటంతో, ఎన్యూమరేటర్లు...