24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందూర్ జిల్లా క్రీడాకారులకు అడ్డా

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 నిజామాబాద్ సిటీ, బతకమ్మ :  నిజామాబాద్ జిల్లా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లని అన్నారు. క్రీడాలను, క్రీడాకారులను ప్రోత్సాహించడంలో తన వంతు కృషి చేస్తానని అన్నారు. జార్జయో బాటుమి లో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్  ఉషు టోర్నమెంట్ సబ్ జూనియర్, జూనియర్ కేటగిరిలో సిల్వర్, బ్రౌన్ మెడల్స్ సాధించిన ఆకాంక్ష యాదవ్, ఫారియా ఖాన్, సాయి దిక్షిత్ లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతు ఇందూర్ జిల్లా అంటేనే క్రీడాలకు పుట్టినిల్లని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రానించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తెచ్చిన ఎండల సౌందర్య, నీకత్ జారిన, ఆనంద్ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారని గుర్తు చేసారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో కూడా రాణించడం వాళ్ళ విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృడంగా ఉంటారని అన్నారు. ఉషు క్రీడాలో మెడల్స్ సాధించిన ఆకాంక్ష యాదవ్, ఫారియా ఖాన్, సాయి దీక్షిత్ లు ఇంకా ఉన్నత శిఖరాలు అవరోదించాలని కన్న తల్లి తండ్రులకు, జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడానికి కృషి చేస్తున్న కోచ్ అబ్దుల్ ఓమర్ను ప్రతేకంగా అభినందించారు.

Adda to the players of Indore district

More articles

Latest article