కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల ను. జిల్లా నోడల్ ఆఫీసర్ ఎస్ కే. సలాం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలేజ్ అడ్మిషన్ లు, అడ్మిషన్ రిజిస్టర్ పరిశీలించారు. టీచింగ్ డైరీ లను, సబ్జెక్టుల వారిగా సిలబస్ లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలన అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ మీటింగ్ ను ఏర్పాటుచేసి ఉపాధ్యాయులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సాయిబాబా, సీనియర్ అధ్యాపకుడు రవీందర్,సాయిలు నరేష్,అవినాష్,రాజ్ కుమార్ ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
