26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అనుమతి లేకుండా అడ్డుగోడ నిర్మించిన పాస్టర్ పై చర్యలు తీసుకొవాలి

Must read

📰 Generate e-Paper Clip

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన భీమ్ గల్ మాల సంఘ సభ్యులు
భీమ్ గల్, బతుకమ్మ : తమ తాత , ముత్తలు త్రాగునీటి కోసం తవ్విన చేదబావిని అక్రమంగా కూల్చివేసి , అనుమతి లేకుండా అడ్డుగోడను నిర్మించి, బావి అడుగు స్థలాన్ని ఆక్రమించుకున్న చర్చి నిరాహకుడు పాస్టర్ ఇజ్రాయిల్ పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం భీమ్ గల్ మాల సంఘం ప్రెసిడెంట్ డీ.ఎస్ రవీంధర్ అధ్వర్యంలోని సంఘ సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ గోడ విషయమై 2022లో స్థానిక మున్సిపల్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయగా అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేయాలని ఉత్తర్వులు వచ్చాయని, ఇప్పటికి అధికారులు పట్టించుకోవడం లే దన్నారు. ఈవిషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని రవీంధర్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ ను కలిసిన వారిలో సంఘ సభ్యులు సంపత్ , నర్సు, రంజిత్, నవీన్ , బాగేష్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article