సిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి

0 14,701
  • డిఎంహెచ్ఓ కు ఫిర్యాదు

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్డులో సిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం బాధితుడు మహ్మద్ సోహెల్ మాబూద్ మాట్లాడుతూ సిటీ ఆసుపత్రిలో నిఫుణులు అయిన వైద్యం లేకుండానే వైద్యం అందంచి మోసం చేస్తున్నారని ఆరోపించారు. తమ తమ్ముడి భార్య ఫిట్స్ రాగా పరిస్థితి విషమించడంతో బోధన్ రోడ్డులోని సిటీ ఆసుపత్రికి గురువారం ఉదయం తీసుకురావడం జరిగిందన్నారు. నిపుణులైన న్యూరో స్పెషల్ లేకుండానే సిబ్బంది వైద్యం అందించడంతో పరిస్థితి విషమించిందని ఆమె  ఫిర్యుదులో పేర్కొన్నారు. ఆమె పరిస్థితి మరింత విషమించడంతో యజమాన్యానికి ఫిర్యాదు చేయగా వారు తమపైనే దుర్భషలాడుతూ బెదిరించారని బాధితుడు వాపోయారు. దీంతో తాము దిక్కుతోచని పరిస్థితిలో రోగికి మరో ఆసుపత్రికి తరలిండం జరిగిందన్నారు. ఆసుపత్రి వ్యవహరిస్తున్న మోసంపై డీఎంహెచ్ వోకు  ఫిర్యాదు చేయడంతో సానుకూలగా స్పందించారని తెలిపారు. తమ బ`దాన్ని పరిశీలించి ఆసుపత్రి పరిశీలిస్తామని , నిర్లక్ష్యం చేసినట్లు తేలితే తగు చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ వో మీడియాతో వెల్లడించారు.

Action should be taken against the city multi-specialty hospital.

Leave A Reply

Your email address will not be published.