29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాక్లురు మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మదారి సాయిలు అనే రైతు కష్టపడి పంట పండించి వరి కొనుగోలు కేంద్రాలకు తెచ్చాడని తెలిపారు. తెచ్చి నెల రోజులు గడిచిన తర్వాత వడ్లు కాంటా వేసి 41 కిలో 800 గ్రాములు తరుగు తీశారు. ఆ తర్వాత 698 బస్తాల లోడ్ పంపిన తర్వాత కోటగిరి రైస్ మిల్ గణేష్ ఆగ్రో ఇండస్ట్రీ క్వింటాల్ కు రెండున్నర కిలోల చొప్పున తరుగు తీస్తామని చెప్పాడని వాపోయారు. రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని ఇలా దోపిడీ చేసిన రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాజేశ్వర్ రైతు మదారి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article