. . . జిల్లా విద్యార్థి సంఘాలు
నిజామాబాద్, బతుకమ్మ :
ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాలో లాంచ్ చేస్తున్న రిసోనాన్స్ అకాడమీపై చర్యలు తీసుకోవాలని జిల్లా లోని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారిని విద్యా శాఖ భవనంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకున్నా కూడా రిసోనాన్స్ అకాడమీ ఐఐటి ఫౌండేషన్, నీట్ అకాడమీ అంటూ గురువారం వంశీ హోటల్ లో లాంచ్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ నారాయణ ముఖ్య అతిథిగా రాబోతున్నారన్నారు. అనుమతులు లేని సంస్థ కోసం మాజీ ఐపీఎస్ వస్తున్నాడంటే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఇలాంటి వ్యక్తి ప్రచారానికి వస్తున్నాడంటే చాలా మంది తల్లిదండ్రులు, విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకుంటారన్నారు. మనం ఒక సంస్థ కి సపోర్ట్ చేసేటప్పుడు దాని స్థితి గతులు తెలుసుకోకుండా ప్రచారం చేయడం సరి కాదన్నారు. రేపటి రోజు ఈ విద్యా సంస్థల్లో జాయిన్ ఐన వారిలో ఎవరికైనా ఇబ్బంది కలిగినా, ఎవరైనా మోసపోయినా తల్లి దండ్రులు ఎవరిని అడుగుతారని ఆయన ప్రశ్నించారు. అందుకే గురువారం జిల్లా విద్యాధికారి వెంటనే స్పందించి రిసోనాన్స్ అకాడమీ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని విద్యార్థి సంఘాలు టీఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్, టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేశ్, బీసీ విద్యార్థి సంఘం నవత ప్రతాప్, టీఎన్ఎస్ఎఫ్ యూసుఫ్, టీఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల, బిసివిఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
