. . . విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
. . . డిఈఓకు వినతి పత్రం అందజేత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం ముగియకముందే 2026 _2027 సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు దీన్నీ ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపియన్ చేసి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అదేవిధంగా స్కూల్ కి సంబంధించిన 2026 2027సంబంధించి విద్యా శాఖ నుండి ఎటువంటి పర్మిషన్ లేకపోయినా హోర్డింగ్ లు ,ఫ్లెక్సీలు పెట్టి సీబీఎస్సీ పేరుతో అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు.కావున విద్యార్థుల తల్లిదండ్రులను తప్పు దోవ పట్టిస్తున్న ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిఇఓ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుభోద్, జిల్లా ఉపాధ్యక్షుడు కుశాల్, జిల్లా నాయకులు కిషోర్, నిఖిల్ ,గణేష్ పాల్గొన్నారు.