. . . డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్
డిచ్ పల్లి, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి మండల కేశపూర్ శివారులోని నారాయణ సీబీఎస్ ఈ పేరుతో బిల్డింగ్ నిర్మాణం పూర్తవకముందే ఎటువంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ని బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. దీనిపై డీఈవో స్పందించి చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
