30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్టీసీ డిపోలో జంతుబలిపై చర్యలా?

Must read

📰 Generate e-Paper Clip

. . . ముగ్గురు అధికారులకు చార్జీషీట్లా 

. . . ఎం.డికి చేరిన నిజామాబాద్ డిపో 1 ఉదంతం

. . . మెకానిక్ లపై తోసివేసేందుకు సంతకాల సేకరణ

. . . ఓ అధికారి నిర్వాకంతో అందరి మెడకు జంతుబలి వివాదం

నిజామాబాద్, బతుకమ్మ :

రాష్ట్ర రవాణా శాఖలోని డిపోలలో జంతుబలి నిషేద ఉల్లంఘన చేసి మేకను వధించిన ఘటన వ్యవహరం అధికారుల మెడకు చుట్టుకుంది. రహస్యంగా జరిగిన జంతువధ వ్యవహరం బహిర్గతం కావడంతో ఆర్టీసీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. జిల్లాకు చెందిన ప్రధాన అధికారులకు ముగ్గురికి చార్జిషీట్లు(మెమోలు) జారీ చేసినట్లు తెలిసింది. అయితే ఈ ఉదంతానికి కీలక సూత్రదారి తన ప్రమేయం ఏమి లేదని చెప్పుకునేందుకు మెకానిక్ లను బలి చేసేందుకు సిద్దమైనట్లు తెలిసింది. తామే విందు చేసుకునేందుకు మేకను వధించినట్లు చెప్పాలని కోరుతూ సంతకాల సేకరణ చేసిన విషయం బట్టబయలైంది.
నిజామాబాద్ -1వ ఆర్టీసీ డిపోలో గత నెల 31న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కొందరు మెకానిక్ లు మేకను వధించారు. సంబంధిత మేకను కోసి ఆటోలో బైపాస్ రోడ్డులోని మహాలక్ష్మీ గుడి ప్రాంతానికి తీసుకెళ్లి విందు చేసుకున్నారు. మద్యం, మాంసంతో జరిగిన ఈ విందుకు డిపో అధికారులతో పాటు మెకానిక్ లు, ఇతరులు హాజరయ్యారు. కానీ అక్కడ రాత్రిపూట విధులు నిర్వహించిన కొందరు ఈ తతంగాన్ని వీడియో తీయడంతో జంతుబలి వ్యవహరం బహిర్గతమైంది. అక్కడ నిషేదం ఉన్న ఎలా జంతువధ జరిగిందని కొందరు ప్రశ్నించగా అధికారులే ప్రశ్నలకు అనుమతిచ్చారని చెప్పిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం బట్టబయలు కావడంతో కొందరు వీడియోలను ఆర్టీసీ ఎండికి ఫిర్యాదు చేశారు. దాంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
నిజామాబాద్ జిల్లాలో గతంలో భీంగల్ డిపోలో నిషేదం ఉన్న జరిగిన జంతుబలి విషయంలో అధికారులకు చార్జిషీట్ అందాయి. ఈసారి కూడా ముగ్గురు అధికారులకు చార్జీషీట్లు వచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితమే అధికారులు తప్పిదాన్ని మెకానిక్ లపైకి తోసివేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాము చెప్పినట్లు వినకుంటే చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడి మెకానిక్ ల ద్వారా తామే విందు కోసం మేకను బలిచ్చామని ఇందులో అధికారులు అనుమతివ్వలేదని తెల్లకాగితాలపై సంతకాలు చేయించినట్లు తెలిసింది. ప్రధానంగా అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి తన ఉద్యోగ శైలిపై రిమార్కు రాకుండా ఉండేందుకు నానాతంటాలు పడుతుండడం విశేషం. అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పైరవీలను కూడా చేస్తున్నట్లు తెలిసింది.

More articles

Latest article