. . . కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు
కామారెడ్డి, బతుకమ్మ :
ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి న్యాయ స్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయ మూర్తి వరప్రసాద్ తీర్పు ఇచ్చారు. ఈ మేరకు కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు నిచ్చింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కేంద్రానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రహీం ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు. 2022 ఆగస్ట్ 5న స్కూల్ కి వెళ్లిన బాలికను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని తనతో పాటు తీసుకెళ్లాడు. కామారెడ్డి రైల్వే స్టేషన్ రైలులో ఢీల్లికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాఠశాలకు వెళ్లిన కూతురు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యదు చేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఢిల్లీలో ఉన్న మైనర్ బాలికను రక్షించారు. బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అబ్దుల్ రహీం పై కేసు నమోదు చేశారు. సమగ్ర సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను సేకరించి కోర్టులో పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద పక్కాగా చార్జ్ షీటు దాఖలు చేశారు. కోర్టులో నేరం పక్కాగా నిరూపితం కావడంతో న్యాయమూర్తి నిందితునికి 20 ఏళ్ల కఠిన శిక్ష, జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాధితురాలికి భరోసా కల్పించి నేరస్తుడికి శిక్ష పడేలా అంకితభావంతో పని చేసిన అప్పటి డిఎస్పీ ఏ.శ్రీనివాసులు, ప్రస్తుత డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ రావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె.శేషు, సూర్య ప్రసాద్, తాడ్వాయి ఎస్ హెచ్ఓ వై.నరేష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ టి.సాయి బాబులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
