. . . రూ.1.10 లక్షల నగదు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి నేరస్తుడిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నేరస్తుడు రియాజ్ ఖాన్ (33), అఫ్జల్ ఖాన్ కుమారుడు, శాంతినగర్ నివాసిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం, జల్సాలకు అలవాటు పడిన రియాజ్ ఖాన్‌కు డబ్బుల కొరత ఏర్పడటంతో దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జూన్ 17, 2026 అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో శాంతినగర్‌కు చెందిన అజ్మీర్ బేగం ఇంటిలోకి చొరబడి బీరువాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.1,20,000 నగదు, ఆరు గ్రాముల బంగారు చెవి కమ్మలు, 20 తులాల వెండి పట్టగొలుసులను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఖిల్లా చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.1,10,000 నగదు, చోరీకి ఉపయోగించిన ఒక ఇనుప సుత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. రియాజ్ ఖాన్‌పై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు, నిజామాబాద్ 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో మరో ఒక కేసు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.
