24.8 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రమాదవశాత్తు  బస్సు కింద పడి చిన్నారికి గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం

ప్రమాదవశాత్తు  స్కూల్ బస్సు కింద పడి చిన్నారికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం సుభాష్ నగర్ లో జరిగింది. నిజామాబాద్ రైల్వే క్వార్టర్ ప్రాంతానికి చెందిన అపర్ణ స్థానిక హోలి మేరి పాఠశాలలో పిపి-2 చదువుతుంది. ఉదయం తండ్రి బైక్ మీదా స్కూల్ కు వేలుతుండగా సుభాష్ నగర్ చౌరస్తాలో బైక్ స్కిడ్ కాగా అపర్ణ కింద పడింది. అప్పుడే ఎదురుగా వస్తున్నవిజ్ఞాన్ స్కూల్ బస్సు కింద అపర్ణ పడటంతో గాయాలు అయ్యాయి.  అపర్ణను హుటా హుటిన అసుపత్రికి తరలించారు. గాయపడిన అపర్ణకు ప్రమాదం ఎమి లేదని స్వల్ప గాయాలు అయ్యాయి అని తెలిసింది. బస్సు కింద పడిన అపర్ణకు  పెద్ధగా గాయలు కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఉపిరి పిల్చుకున్నారు. సంబందిత ప్రమాదానికి బైక్ మీద నుంచి చిన్నారి కిందపడిన దృశ్యం విడియోలో స్పష్టంగా ఉంది.

Accidentally, the child fell under the bus and got injured

More articles

Latest article