హెచ్ఎంబి జాతీయ రహదారి పై ప్రమాధం

0 2,683

 

. . . కల్వర్టు పైనుంచి కాలువలో పడిన కారు

. . . ఇద్ధరి దుర్మరణం

 . . . ముగ్గురికి తీవ్రగాయాలు

 ఎల్లారెడ్డి, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మల్లయిపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి కారు కాలువలో పడి ప్రమాదం చోటు చేసుకుంది. హైద్రబాద్- మెదక్- బోదన్ జాతీయ రహదారి విస్థరణ పనులు జరుగుతుండగా కల్వర్టు వద్ధ రోడ్డు డైవర్షన్ సూచికలు లేకపోవడంతో ఈ ప్రమాధం జరిగింది. కారు వేగంగా అదుపు తప్పి నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు పైనుంచి కాలువలో పడింది.ఈ కారు ప్రమాదంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నర్సింగ్ రావు పల్లి తండా కు చెందిన డ్రైవింగ్ చేస్తున్న పిర్యా (38), పిర్యా (32) ప్రమాదం జరిగిన ఘటన స్థలంలోనే మృతి చెందారు.

Accident on HMB National Highway

 

పిర్యా కుమారులైన సోను, ప్రవీణ్, వేణు, లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి ఎచ్ ఎం బి జాతీయ రహదారి నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురుఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. పెద్ధ గుట్ట ధర్గాలో కందూరుకోసం వెలుతుండగా ఈ ప్రమాధం జరిగింది. రాత్రి కారు కాలువలో పడటంతో ఆగ్నిమాపక శాఖ సహయంతో క్షతగాత్రులను పైకి తీసుకురావాడానికి పోలీసులు శ్రమించారు.

Accident on HMB National Highway

 

జాతీయ రహదారిపై భాధిత కుటుంబ సభ్యుల ఆందోళన…

బుధవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన పీర్య కుటుంబ సభ్యులు గురువారం ఉదయం ఎల్లారెడ్డి మెదక్ రహదారిపై ఆందోళనకు దిగారు. కారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.దీంతో మెదక్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న  ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్, ఎస్సై బొజ్జ మహేష్ రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులతో మాట్లాడి గుత్తేదారులకు పిలిపించి తమకు న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబాలు రాస్తారోకో విరమించారు.

Accident on HMB National Highway

Leave A Reply

Your email address will not be published.