వెబ్ డెస్క్, బతుకమ్మ:
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో ఎసిబి అధికారులు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవిందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవిందర్ నివాసం ఉన్న నానక్ రాం గుడాలోని ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో ఎసిబి డిఎస్పీ మాజీద్ ఆలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అంతే కాకుండా సిఇ రవిందర్ సన్నిహితుల ఇండ్లల్లో ఇతర 12 ప్రాంతాల్లో ఓకేసారి సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఆయన నివాసంలో కట్టల కోద్ధి డబ్బులు, ఆస్థి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. కొన్ని లాకర్ లను కూడా గుర్తించారు. వాటిని తెరిచిన తర్వాత మొత్తం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

