. . . ఇంజనీర్ నివాసంలో నోట్ల కట్టలు
వెబ్ డెస్క్, బతుకమ్మ:
కాంట్రాక్టర్ చేసిన పనులకు బిల్లులు మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఇంజనీర్. పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఎఇ) కల్లెపల్లి సతీష్ కుమార్ రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బల్దియాలో తొమ్మిదవ పైనాన్స్ నిధులు( టియుఎఫ్ఐడిసి) కింద మంజూరైన స్మశాన వాటిక నిర్మాణం చేసిన కాంట్రాక్ట్ పనుల తాలూకు రూ.12,28,748 బిల్లుల కోసం ఎఇ సతీష్ ను సంప్రదించారు. రూ.4 లక్షల లంచం ఇస్తేనే బిల్లులు మంజూరు జరుగుతుందని ఎఇ చేప్పడంతో కాంట్రాక్టర్ ఎసిబిని ఆశ్రయించారు. కరీంనగర్ ఎసిబి డిఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తన కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సతీష్ ను పట్టుకున్నారు. సతీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు రూ.32.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎఇ సతీష్ ను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు. బల్ధియా కార్యాలయంతో పాటు సతీష్ ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
