ఏబీవీపీ ఖేలో భారత్ ఉత్సవ్ క్రీడా పోటీలు ప్రారంభం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏబీవీపీ ఇందూర్ శాఖ ఖేల్ భారత్ ఉత్సవ్ క్రీడా పోటీలను శనివారం నగరం లోని గిరిరాజ్ కళాశాలలో నిజామాబాద్ అర్భన్ ధన్పాపాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఏబీవీపీ ఇందూర్ విభాగ్ ప్రముఖ రేంజర్ల నరేష్ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్వహించే ఖేలో భారత్ ఉత్సవాలు స్వామి వివేకానంద 162వ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128 జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థుల కోసం...