అబాస్ అటెండెన్స్ మొదలు పెట్టాలి

0 14,536
  • డిఎంహెచ్ఓ డా.రాజశ్రీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అబాస్ అటెండెన్స్ జీరో ఉన్న పీహెచ్ స్సీలు ఇప్పటికైనా అబాస్ అటెండెన్స్ మొదలు పెట్టాలని డిఎంహెచ్ఓ డా.రాజశ్రీ ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ లోని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా ఉపవైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులకు, సూపర్వైజర్ అధికారులు, వైద్య సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఆరోగ్యంలో ఫార్మసీ అధికారులు అంతా ఏ రోజుది ఆ రోజు ఎంట్రీ చేయాలని అన్నారు. ప్రతి పీ ఎస్ సి లో అవుట్ పేషెంట్లుగా వచ్చిన రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. మదర్ అండ్ చైల్డ్ ఆరోగ్యంలో భాగంగా గర్భిణీ స్త్రీల నమోదు 120 శాతం ఉండాలని అందులో మొదటి రెండవ గర్భిణీ స్త్రీల పరీక్షలను స్థానిక పి హెచ్ స్సీ వైద్యాధికారి చేయాలని తెలిపారు. మూడోసారి నాలుగోసారి గర్భిణీ స్త్రీల చెకప్లను తప్పకుండా స్త్రీ వైద్య నిపుణుల  చేత పరీక్షించాలని తెలియజేశారు. గర్భిణీ స్త్రీల నమోదులో అలసత్వం వహించే ఏఎన్ఎం లను ఆశా కార్యకర్తలపై  నెలవారి లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాల్లో ప్రతి ఆశ కార్యకర్త అర్హులైన వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడే మహిళలను సమయానికి ఆరోగ్య మహిళ కేంద్రాలకు తరలించాలని తద్వారా వారికి అవసరమైన ప్రత్యేక ఆరోగ్య పరీక్షలను నిర్వహించాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలను పకడ్బందీగా నిర్వహిస్తూ 100% పూర్తి చేయాలన్నారు. ఇమ్యూ నైజేషన్ సెషన్ చేసే ఒక రోజు ముందే టీకాల అర్హుల జాబితాను పీహెచ్సీలో ఫార్మసీ అధికారికి,మెడికల్ ఆఫీసర్ కు అందజేయాలన్నారు. మూడు నెలల పాటు కొనసాగుతున్న సాన్స్ కార్యక్రమంలో భాగంగా నిమోనియాతో బాధపడే చిన్నారులను గుర్తించి, వారికి చికిత్స అందించాలని అన్నారు. రాష్ట్ర బాల స్వస్థ్య కార్యక్రమంలో ప్రతి పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని క్రమం తప్పకుండా సందర్శించి ప్రతి విద్యార్థిని పరీక్షించాలన్నారు. అసంక్రమిక వ్యాధుల నియంత్రణలో భాగంగా వారం రోజులపాటు కొనసాగుతున్న ఆంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఇందులో భాగంగా యాంటీబయోటిక్స్ వాడకన్ని తగ్గించాలని, పూర్తి కోర్సు వాడాలని, పాత ప్రెస్క్రిప్షన్ ప్రకారం వాడ రాదని, సొంత వైద్యానికి పోరాదని, చేతుల శుభ్రత పరిసరాల శుభ్రత పాటించాలని తెలియజేశారు. క్షయ నియంత్రణలో భాగంగా టీబి ముక్తా భారత్ కై అందరూ పాటుపడుతూ అనుమానిత క్షయ వ్యాధిగ్రస్తులందరికి తెమడ పరీక్షలు నిర్వహించి, ఎక్స్రే తీయాలన్నారు. ఇప్పుడు జిల్లాలో మొబైల్ ఎక్స్ రే మిషన్లు రెండు ఉన్నాయని వాటిని ప్రణాళిక బద్ధంగా ఉపయోగించి మారుమూలక్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లి ఎక్స్రేళ్ళు తీయా లన్నరు. పిహెచ్ స్సీ వైద్యాధికారులు పర్యవేక్షక అధికారులు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ వారి వారి లక్ష్యల కను గునంగా పనిచేయాలని, ఉద్యోగులందరూ సమయపాలన పాటించాలని,  లేనిచో శాఖ పరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్వేత, డి ఎం ఓ డాక్టర్ వెంకటేష్, డీఎస్ఓ డాక్టర్ నాగరాజు,పి సి పి ఎన్ డి టి పి ఓ డాక్టర్ సుప్రియ, డిపిఓ విశాల రాణి,డిడిఎం నారాయణ, డి హెచ్ ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Abbas should start attending.

Leave A Reply

Your email address will not be published.