- కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాలలో వదిలివేయబడ్డ లేదా పట్టుబడిన వాహనాలను ఆరు నెలల్లోగా తీసుకెళ్లాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. లేకుంటేచట్టపరమైన ప్రక్రియలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆద్వర్యంలో వేలం వేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 217 వాహనాలు (211 టూవీలర్లు, 3 త్రీ వీలర్లు, 3 ఫోర్వీలర్లు) కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో భద్రపరచబడ్డాయని తెలిపారు. వాహన యజమానులు తమ వాహనాన్ని గుర్తించి, సరైన ధ్రువపత్రాలతో పోలీస్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి ఏ.నవీన్ కుమార్ ( 8712525970 / 8712686111) ను సంప్రదించి, ధ్రువపత్రాలను చూపించి వాహనాన్ని తీసుకువెళ్లలని సూచించారు. వాహనాల పూర్తి వివరాలు కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పొందుపరచబడ్డాయని తెలిపారు. Twitter: https://twitter.com/sp_kamareddy, Facebook: https://www.facebook.com/sp.kamareddy1/ ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
