27.5 C
Hyderabad
Friday, July 31, 2026

బోధన్‌లో యువతి భారీ మోసం

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీసులు మూడు ఫోన్లు, రూ.3.8 లక్షలు స్వాధీనం

 

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలో పబ్బులేటి సోనీ ప్రత్యూష అనే యువతి నకిలీ అనాధగా నటించి నాగన్‌పల్లి‌కు చెందిన శ్రీనివాస్ దంపతులను మోసం చేసింది. తాను అనాధనని, తన బ్యాంక్ అకౌంట్‌లో రూ.10 లక్షలు ఉన్నాయని తన ఖాతా కొన్ని కారణాల వల్ల పని చేయడం లేదని తనకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయని మీరు సహాయం చేస్తే త్వరలోనే తిరిగి పంపిస్తాను అని, నమ్మించి వారి అకౌంట్‌ వివరాలు, ఏటీఎం కార్డు, పిన్, సిమ్ కార్డ్ తీసుకొని రూ.7,49,500/- ను వారి అకౌంట్ నుండి తీసుకొని పరారైంది. ఐరెండ్ల నరేష్ అనే వ్యక్తి సహకారంతో నగదు విత్‌డ్రా చేసి పారిపోయిన ప్రత్యూషపై బోధన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఈ విషయమై విచారణ చేపట్టి సోని ప్రత్యుషను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.3.8 లక్షలు, రెండు ఐ ఫోన్లు, ఒక ఒప్పో ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సోని ప్రత్యుష పై ఇంతకు ముందు నిజామాబాద్, నందిగామ, మాదాపూర్ (సైబరాబాద్) పోలీస్ స్టేషన్లలోనూ ఇదే తరహా చీటింగ్ కేసులు ఉన్నాయని, బోధన్ టౌన్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. అదేవిధంగా అపరిచితులను నమ్మి మోస పోవద్దని తెలిపారు.

More articles

Latest article