29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ  : జాతీయ రహదారిపై ఎలాంటి  సూచికలు లేకుండా నిలిచిన ట్రాక్టర్ ను వెనుక నుంచి  వచ్చి బైక్ ఢీకొట్టడంతో దానిని  నడుపుతున్న యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి పట్టణ శివారులోని షాబిపూర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగింది. కామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నవీన్(24) కార్పెంటర్ పని నిమిత్తం రామేశ్వర్ పల్లి వెళ్లి తన సొంతూర్ వస్తుండగా జాతీయ రహదారిపై నిలిచిన ట్రాక్టర్ ను బైక్ తో ఢీకొట్టగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని నవీన్ చనిపోయినట్లు నిర్ధారించారు. నవీన్ తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై గుండెల రాజు తెలిపారు.

A young man died after being hit by a tractor

More articles

Latest article