31.7 C
Hyderabad

పెద్ద చెరువులో మహిళ మృతదేహం

Must read

📰 Generate e-Paper Clip

 కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డిలోని పెద్ద చెరువులో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న దేవునిపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటికి తీయించారు. మృతురాలి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్లు ఉంటుందని, మెడలో నల్లపూసల దండ, చేతిపై ఇంగ్లిష్ లో రాజు అని పచ్చబొట్టు ఉందని తెలిపారు. మృతురాలి సంబంధీకులు ఎవరైనా ఉంటే కామారెడ్డి రూరల్ సీఐ – 8712686148, దేవునిపల్లి ఎస్సై-8712686150 నంబర్లను లేదా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.

 

More articles

Latest article