29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆటో డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట్, బతుకమ్మ: నవీపేట్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలో పార్లమెంటు పోస్టర్లను ఆటో యూనియన్ సీఐటీయూ అనుబంధం జిల్లా అధ్యక్షుడు కటారి రాములు, సయ్యద్ ఫసిద్దిన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఫైనాన్స్ ల వేధింపులు విపరీతంగా పెరిగాయని, వేధింపులు మానుకోవాలని లేని పక్షంలో వారిపై పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ వేధింపులు మానుకోవాలన్నారు. గృహలక్ష్మి పేరుతో మహిళలకు బస్సు ఫ్రీ చేయడం వల్ల ఆటో కార్మికుల జీవనాధారం బాగా దెబ్బతిన్నదని, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12వేల ఇవ్వడంతోపాటు నెలకు రూ.4వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సొంత జాగా ఉన్న ఆటో డ్రైవర్లు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాయక్ వాడి శ్రీనివాస్, మండలాధ్యక్షులు మేకల ఆంజనేయులు, నవీపేట్ మండల ఆటో యూనియన్ నాయకులు కబీర్ ఖాన్, రాజారాం, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article