నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథ) పీడీఎస్ యూ, పీవైఎల్, పీవో డబ్ల్యూ సంఘాల ధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి నిర్వహించారు. నగరంలోని దేవిరోడ్డు చౌరస్తా, కోటగల్లీలోని భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పాలకవర్గాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని విద్యార్థులు, యువతకు నాయకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, నాయకులు భాస్కరస్వామి, లింగం, కిరణ్, విఠల్, గంగాధర్, దీపక్, పీడీఎస్ యూ, పీవైఎల్ నాయకులు సాయితేజ, రమేశ్, మహిపాల్, లింగం, పావని, అనిత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.