ఆటో డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
నవీపేట్, బతుకమ్మ: నవీపేట్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలో పార్లమెంటు పోస్టర్లను ఆటో యూనియన్ సీఐటీయూ అనుబంధం జిల్లా అధ్యక్షుడు కటారి రాములు, సయ్యద్ ఫసిద్దిన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఫైనాన్స్ ల వేధింపులు విపరీతంగా పెరిగాయని, వేధింపులు మానుకోవాలని లేని పక్షంలో వారిపై పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ వేధింపులు మానుకోవాలన్నారు. గృహలక్ష్మి పేరుతో...