27.8 C
Hyderabad

హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  గురువారం రుద్రూర్ మండల సమీకృత సముదాయముల భవనం ఎదుట ఆందోళన చేపట్టి, తహసీల్దార్ తారాబాయి కు  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని కోరారు. 55 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులందరికీ 6వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 120 గజాల స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు భీమయ్య, మహబూబ్, లక్ష్మణ్, సాయిలు, పీరయ్య, గంగాధర్, కిరణ్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article