హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
రుద్రూర్, బతుకమ్మ : హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం రుద్రూర్ మండల సమీకృత సముదాయముల భవనం ఎదుట ఆందోళన చేపట్టి, తహసీల్దార్ తారాబాయి కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సీఎం...