24 C
Hyderabad
Sunday, August 2, 2026

 కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్, బతుకమ్మ :  క్విట్ ఇండియా ఉద్యమం,స్వతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న  కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని బీసీ సంఘాలు,అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు.  ఈసందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ మాట్లడుతూ  తెలంగాణ తొలి, మలి దశ  ఉద్యమకారుడు, తెలంగాణ బాపూజీ, తెలంగాణకు అసలు సిసలు జాతి పిత  కొండా  కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.  సహకారోద్యమానికి నాంది పలికి,  ఎన్నో రకాల సామాజిక సంఘాలను స్థాపించిన,బీసీ సంక్షేమ,సహకార సంఘాలకు మార్గనిర్దేశం చేసిన మహానీయుడు బాపూజీ అని తెలిపారు.  ఈ క్రమంలో అంబేడ్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, బీసీ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షులు సబ్బని ధర్మపురి, కృష్ణ హరి,రజక సంఘం జిల్లా అధ్యక్షులు రాజయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా సోషల్ మీడియా ఇంచార్జీ రాజేందర్,బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గౌడ్, బీసీ యూత్ జిల్లా కార్యదర్శి మహేశ్, వివిధ బీసీ కూల సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వివిధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు,కార్యకర్తలు,యువకులు ,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article