- పార్టీ లైన్లో మెదిలే వారికే ప్రాధాన్యత
- సీనియర్లంతా ఒకే తాటిపై పని చెయ్యాలి
- ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
భీమ్ గల్, బతుకమ్మ : రానున్న పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఇటు సీనియర్ నాయకులు, అటు ఉత్సావంతులైన ఉన్న యువకులకు అధిష్టానం సముచిత స్థానంను కల్పించడం జరుగుంతుందని నియోజకవర్గ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సోమవారం భీమ్ గల్ మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.గ్రామ, మండల స్థాయి పార్టీ పదవుల ఎంపికలో సీనియర్లకు ప్రాధాన్యత ఉంటుందని, అందుకు అటు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు, ఇటు ఎన్ ఎస్ యు ఐ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఉదాహరణ అని స్పష్టం చేశారు.కానిస్టెన్సీలో ఉన్న సీనియర్ నాయకులంత పార్టీ లైన్లో ఒకే తాటిపై పనిచేయాలని సంస్థాగత ఎన్నికలో కలిసికట్టుగా ఉండి సీనియర్లకు, ఉత్సవంతులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. కానిస్టెన్సీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ప్రజలకు, ప్రభుత్వానికి వారదులాగా ఉండాలని, పార్టీ ప్రతిష్టతకు ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు. పార్టీని నమ్మి వేలాది మంది కాంగ్రెస్ కు ఓట్లు వేశారని, వారి ఆశలను నేర్వర్చాలన్నారు. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ఎకాభిప్రాయం తో గ్రామ కమిటీలను వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో కానిస్టెన్సీ పర్యవేక్షకులు ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, డీసీసీ ప్రెసిడెంట్, స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామి, పట్టణ అధ్యక్షుడు జే జే నర్సయ్య, అనంతరావ్, కుంట రమేష్, మల్లెల లక్ష్మణ్, కన్నె సురేందర్,కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పాలేపు నర్సయ్య గ్రామ శాఖ అధ్యక్షులు, బీసి ఎస్సి ,ఎస్టి ,మైనారిటీ అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.