29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అదనపు కలెక్టర్ ( రెవిన్యూ) వి.విక్టర్

 

కామారెడ్డి, బతుకమ్మ : కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యం ను త్వరగా తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలనీ అదనపు కలెక్టర్ ( రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. సోమవారం సదాశివ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లోనీ వరి పంటను వీలయినంత తొందరగా తూకం వేసి ట్యాబ్ ఎంట్రీ చేసి రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. అకాల వర్షాల వలన ధాన్యం తడిసి పోతున్నదని, రైతులకు టార్పాలిన్ లను అందించాలని కేంద్రం ఇంచార్జీలను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, రైతులు, కేంద్రం ఇంచార్జీ లు పాల్గొన్నారు.

Grain should be moved to mills quickly.

More articles

Latest article