25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

గురుశిష్యుల ఆత్మీయ సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలో వర్ని రోడ్డులో గల పద్మా నగర్ రోడ్ లోని వివేకానంద విద్యాలయం పూర్వ విద్యార్థులు ఆదివారం వంశీ ఇంటర్నేషనల్ హోటల్ నందు “గురుశిష్యుల ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2002-2003 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు తమ చిన్ననాటి మిత్రులను, చదువు చెప్పిన గురువులను కలుసుకొని సందడి సందడిగా ఆనందంగా గడిపారు. తమ గురువుల ప్రతిభా విశేషాలను కొనియాడుతూ, వారి కారణంగానే ఇంత వారిమయ్యామని వారిని ఘనంగా సన్మానించారు. వివేకానంద అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అని తమ పాఠశాల కార్యకలాపాలను ఉదయం ప్రార్థన సమయం నుండి సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు నిర్వహించే అన్ని అంశాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులు తెలుగు మొదలుకొని సాంఘిక శాస్త్రం వరకు ఏ విధంగా చెప్పేవారో వారి సముఖంలోనే ప్రస్తుతించారు. తమ గురువుల హావ భావాలను ఆనందంగా గుర్తు చేసుకున్నారు.

More articles

Latest article