గురుశిష్యుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలో వర్ని రోడ్డులో గల పద్మా నగర్ రోడ్ లోని వివేకానంద విద్యాలయం పూర్వ విద్యార్థులు ఆదివారం వంశీ ఇంటర్నేషనల్ హోటల్ నందు "గురుశిష్యుల ఆత్మీయ సమ్మేళనం" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2002-2003 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు తమ చిన్ననాటి మిత్రులను, చదువు చెప్పిన గురువులను కలుసుకొని సందడి సందడిగా ఆనందంగా గడిపారు. తమ గురువుల ప్రతిభా విశేషాలను కొనియాడుతూ, వారి కారణంగానే ఇంత వారిమయ్యామని వారిని ఘనంగా సన్మానించారు. వివేకానంద అంటే ఒక పేరు...