29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వేసవి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఫాగింగ్ మిస్ట్ యంత్రాలను ప్రారంభించిన సీపీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఫాగింగ్ మిస్ట్ యంత్రాల ద్వారా సుమారుగా మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చని వేసవి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. వేసవి కాలంలో తీవ్ర ఎండల ప్రభావంతో ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నగరంలో పలు కూడళ్ల వద్ద ఎండ తీవ్రతను తగ్గించడానికిఫాగింగ్ మిస్ట్ యంత్రాలను ఏర్పాటు చేయించారు. కోర్ట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేయించిన యంత్రాన్ని గురువారం సీపీ ప్రారంభించారు.

 

A little relief from the summer

 

కమిషనర్ ఏర్పాటు చేసినటువంటి మిస్ట్ యంత్రాల పనితీరును ట్రాఫిక్ సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. అనంరతం సీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ సిబ్బందికి ఎల్లవేళలా ఆరోగ్య రీత్యా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడానికి తగు చర్యలు తీసుకొని, సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. మిస్ట్ యంత్రాలను ఏర్పాటు చేయడానికి సహకరించిన వాసవి క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్, అశోక్ సిబ్బంది అనిల్, రహీం, నరేష్ షాకీర్, గాంధీ శంకర్ లు పాల్గొన్నారు.

 

A little relief from the summer

More articles

Latest article