బాన్సువాడ, బతుకమ్మ : రాబోయే స్థానిక ఎలక్షన్స్ జడ్పీటీసీ, ఎంపీటీసీ,ఎంపీపీ, సర్పంచ్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలి అని ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు అన్నారు. బాన్స్ వాడ నియోజకవర్గం నసుర్లా బాధ్ మండల కేంద్రంలోమాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు నర్సాగౌడ్ అధ్యక్షతన స్థానిక ఎన్నికల ముఖ్య కార్య కర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, కామారెడ్డి రైతు సమన్వయ మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ నార్ల రత్నకుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రకమాన్ని ఉద్దెశించి ఎలమంచిలి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎలక్షన్స్ జడ్పీటీసీ, ఎంపీటీసీ,ఎంపీపీ, సర్పంచ్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీ తో గెలిపించు కోవాలి అని దానికి కావలిసినఆర్ధిక పరమైన సహకారం కానీ ఇంకా ఎలాంటి సహాయం అయినా అందరం అందిస్తామని తెలిపారు. అధికార పార్టీ వాళ్ళు ఏమైనా భయాందోళన లకు గురి చేసిన ఎలాంటి బెదిరింపులు చేసిన భయపడకూడదని కార్యకర్తలకు మనో ధైర్యం కల్పిస్తూ రాబోయే రోజుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమం లో నసుర్లబాధ్ సాయిలు, నిజామాబాదు జిల్లా టీ ఆర్ ఎస్ వి కోఆర్డినేటర్ ఏజాజ్, మొచి గణేష్, వెంకట్,జాకోరా లక్ష్మన్, వర్ని సొసైటీ డైరెక్టర్ గంగప్ప ,యువ నాయకులు దాస్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
