29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా:మెండోరా మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గొల్ల దేవ మల్లు కు చెందిన ఇంట్లోని ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడం తో  ఇల్లు దగ్ధం అయింది. ఈ ఇంట్లో నాలుగు కుటుంబాలు  నివాసం ఉంటుండగా ఘటన సమయం లో ఇంట్లో ఎవరు లేకపోవడం తో ప్రాణ నష్టం కలగలేదు. నాలుగు కుటుంబాల వారు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న మెండోర పోలీసులు,  బాల్కొండ ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తు ఉండగా ఫైర్ ఇంజన్ లో నీళ్లు అయిపోవడం ఆర్మూర్ నుండి మరొక ఫైర్ ఇంజన్ తెప్పించి మంటలు అర్పారు. కట్టుబట్టలతో మిగలడం తో బాధితుల రోదనలు మిన్నంటాయి. సుమారు 20 లక్షల కు పైగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. తమ విలువైన సామాగ్రి, బంగారం, డబ్బులు అన్ని అగ్నికి ఆహుతి అయ్యాయని తమని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

More articles

Latest article