25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

. . . పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

వసంత పంచమి సందర్భంగా భక్తులకు, ప్రజలకు సరస్వతి దేవి, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆకాంక్షించారు. డిచ్ పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలోని హరి హర క్షేత్రంలో కొనసాగుతున్న వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఆలయం పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జక్రాన్ పల్లి మండలం పడ్కల్ గ్రామంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, గ్రామంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని, కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తామని, ఆలయ పవర్ ట్రాన్స్ ఫర్ సమస్య త్వరగా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తదుపరి జక్రానపల్లి మండలం నారాయణపేట గ్రామంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీవారి కళ్యాణోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ ముప్పు గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు భాస్కరరెడ్డి, మాజీ ఐసిడీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, బర్దిపూర్ సర్పంచ్ భాస్కర్, ధర్మారం సర్పంచ్ వాసు బాబు, పడ్కల్ సర్పంచ్ స్వప్న పురుషోత్తమ్, మునిపల్లి సర్పంచ్ సాయిరెడ్డి, నారాయణపేట సర్పంచ్ ముత్యంరెడ్డి, డిచ్ పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు గంగాధర్, జక్రానపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శాఖ అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

A grand wedding of Lord Venkateswara
A grand wedding of Lord Venkateswara

More articles

Latest article